తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీసీ సజ్జనార్ (VC Sajjanar) రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల (Road accidents) నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా అతివేగం… అనర్థం! అంటూ ఓ వీడియోని ట్వీట్ చేశారు. తొందరగా వెళ్లాలనే ఆత్రంలో మితిమీరిన వేగంతో రహదారులపై వాహనాలతో వెళ్ళకండి. వేగం అదుపులో లేకుంటే ఇలా అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారని సజ్జనార్ అనేక వీడియోలు సోషల్ మీడియా(Social media)లో షేర్ చేస్తున్నారు.
రోడ్డులు అద్దంలా ఉన్నాయని వాహనచోదకులు జెట్ స్పీడ్(Jet speed)లో దూసుకుపోతున్నారు. వాహనం ఏదైనా దూకుడిగా డ్రైవింగ్ చేస్తున్నారు. లేటెస్ట్గా వచ్చే ఏ వెహికిల్ (Vehicle) అయినా వందల నుంచి వేలల్లో సీసీ ఇంజన్లు కలిగి ఉంటున్నాయి. దీంతో రోడ్లెక్కిన బండ్లు రాకెట్ వేగాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎన్నో ఘోర ప్రమాదాలు జరిగి ఏడాదికి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అతివేగం, అజాగ్రత్త కారణంగా జరిగిన ఓ రోడ్డు ప్రమాద (Road accident) వీడియోని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.
సెప్టెంబర్ 2న జరిగిన ఈ ప్రమాదంలో ఎవరు ప్రాణాలు కోల్పోయారు.. ఎవరు బతికి బయటపడ్డారో తెలియదు కానీ.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని బట్టి.. రోడ్డుపై వెళ్తున్న కారు ఓ మూల మలుపు దగ్గరకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ బైకర్ కారును ఢీకొట్టాడు. మూల మలుపు కావడంతో బైక్ను కంట్రోల్ చేయలేని బైకర్ నేరుగా కారు మీదికి రానిచ్చాడు. బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి అమాంతం గాలిలో ఎగిరి కారుపై పడిపోయారు. ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ ఆ వీడియోని ట్వీట్ చేయడంతో వైరల్గా మారింది.
మూలమలుపుల వద్ద అతివేగం ఏమాత్రం పనికి రాదు. మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. ముందు వస్తున్న వాహనాలను గమనిస్తూ డ్రైవ్ చేయాలి. కాదు కూడదని అతివేగంతో దూసుకుపోతే అదుపుతప్పి ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయి. #RoadSafety#RoadAccidentpic.twitter.com/QfhRx9oa5j