చంద్రబాబు (Chandrababu) రిమాండ్‌ను సవాల్ చేస్తూ ఆయన లాయర్లు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాబు అరెస్ట్ చేసిన తీరు అక్రమమని న్యాయవాదులు (Lawyers)వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు(High court) బుధవారం విచారిస్తామని తెలిపింది. ఈ పిటిషన్లో చంద్రబాబు అరెస్ట్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఆయను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. బాబును అరెస్ట్ చేసిన తీరు అక్రమమని అన్నారు. అవినీతి నిరోధక చట్టం (ACB ACT) సెక్షన్ 17 ఏ ప్రకారం అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ (TDP) శ్రేణులు, ఇతర నేతల రాకతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద హడావిడి వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో కారగారం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అంతేకాదు జైలు ప్రధాన వీధిలో రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక భద్రతా సిబ్బంది స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
జైలులో ప్రాణహాని ఉందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టు(ACB Court)లో వాదించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు(Central Jail)లో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం మధ్యాహ్నాం 3 గంటలకు కుటుంబ సభ్యులు ములాఖత్(Mulakat)లో భాగంగా చంద్రబాబును కలవనున్నారు. నారా లోకేశ్(Nara Lokesh), నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణిలు చంద్రబాబుతో భేటీ కానున్నారు. వాస్తవానికి సోమవారం చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ ఉంది. అయితే సమయానికి కుటుంబ సభ్యులు హాజరుకాకపోవడంతో ములాఖత్ రద్దు అయింది.