‘బొమ్మరిల్లు’తో సందడి చేసిన హీరోయిన్ జెనీలియా (Genelia). ఈ అమ్మడు 2012లో బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ని (Riteish Deshmukh) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం.. హాసిని బేబీ బంప్ (Baby bump) తో బయటకు రావడమే. గతరాత్రి ముంబై(Mumbai)లో జెనీలియా, రితేష్ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్ కు జెనీలియా.. వైలెట్ కలర్ మినీ ఫ్రాక్ లో వచ్చింది.
ఇక ఈ గౌన్ లో ఆమె బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో ఆమెను చూసిన అభిమానులు జెనీలియా ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ ఈ జంట ఫొటోలకు పోజులిచ్చింది. అయితే ఆ ఫొటోల్లో హాసిని కాస్త బొద్దుగా కనిపించడం, ఆమె నిల్చున్న విధానం చూసిన నెటిజన్లు (Netizens) ఆమె మూడోసారి తల్లి కానుందంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఆమె బేబీ బంప్‌తో కనిపిస్తోందంటూ ఆ ఫొటోలను షేర్ చేశారు.
తాజాగా ఈ విషయంపై ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్ స్పందించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను తన ఇన్‌స్టా(Insta)లో షేర్ చేసిన రితేశ్.. ఈ వార్తను ఖండించారు. ‘నాకు ఇద్దరు, ముగ్గురు పిల్లలైనా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దురదృష్టవశాత్తు మీరు ప్రచారం చేస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదు. అది పూర్తిగా అబద్ధం’ అని రాశారు. దీంతో ఈ ప్రచారానికి తెరపడింది. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది రితేశ్‌తో కలిసి ‘వేద్’(Ved) మూవీలో జెనీలియా (Genelia) నటించింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘మజిలీ’ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. అలాగే తాజాగా ‘ట్రయల్ పీరియడ్’ (Trial Period) అనే చిత్రంతో పలకరించింది.