Tragedy: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి(Mammootty) ఇంట విషాదం నెలకొంది. ఆయన చెల్లెలు అమీనా(70) అనారోగ్యంతో చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదివరకే మమ్ముట్టి తన తల్లి ఫాతిమా ఇస్మాయిల్‌ను కోల్పోయారు. 93 ఏళ్ల ఫాతిమా ఇస్మాయిల్ కూడా అనారోగ్యంతో మరణించారు. ఇలా వరుసగా విషాదాలు మమ్ముటి ఇంట చోటుచేసుకున్నాయి.
గత ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా కొనసాగుతున్న మమ్ముట్టి తెలుగులో స్వాతికిరణం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన మరెన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.