పంజాబ్లో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. అమృత్సర్ (Amritsar) నగరంలోని మజీతా రోడ్డులో గల ఓ ఔషధాల తయారీ కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఉద్యోగులు ప్రాణలు అరిచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. కానీ ఒక మహిళ ఉద్యోగి (Employee) మాత్రం కంపెనీ నుంచి బయటపడలేక మంటల్లో చిక్కున్నారు. ఆమె అగ్నికి ఆహుతి అయ్యారు. మరికొందరికి గాయ్యాలయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది (Firefighters) ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు (Police) తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.