Video: Vegetable-Selling Lady's Jugaad For Digital Payment
Vegetable-Seller Lady: ఇప్పుడు అంతా ఆన్ లైన్.. అవును ఏదీ కొనాలన్నా స్కానర్ లేదంటే నంబర్ కొట్టి మనీ ట్రాన్స్ ఫర్ చేయడమే.. అదీ ఉదయం లేచి తాగే టీ లేదంటే టిఫిన్, నిత్యవసరాల సరుకులు.. షాపింగ్, ట్రావెల్ చసేందుకు కూడా ఆన్ లైన్లోనే చేస్తారు. ఇక హోటల్స్, రెస్టా రెంట్లు, ఫుడ్ కోర్టుల్లో కూడా స్కానర్ తప్పనిసరి. దాంతో జనాలు జేబులో డబ్బులు పెట్టుకునే అలవాటు మరచిపోయారు.
కింద ఉన్న వీడియోలో కూరగాయాలు అమ్మే వ్యాపారి (Vegetable-Seller) కూడా అలాగే చేసింది. అవును.. టమాట, క్యారెట్, పల్లిలు అమ్ముతుంది. ఇంతలో ఒకతను వచ్చి పల్లీలు తీసుకున్నాడు. అడిగిన మొత్తం ఇచ్చేసింది. తర్వాత స్కానర్ అడగ్గా.. ఆమె వెంటనే త్రాసులో కొలిచే స్టీల్ వస్తువును తీసి వెనకాల చూపించింది. ఆ వెనుక పేటీఎం స్కానర్ ఉంది. సో.. అప్పటివరకు ఆమె ఏం చేస్తుందో తెలియలేదు. ఆ తర్వాత చూసి.. నెటిజన్లు నవ్వు ఆపుకోలేక పోయారు.
చదవండి: INDIA: మా సంస్కృతిని అవమానించారంటూ దీదీపై కామెంట్స్..ముంబై చేరుకున్న కూటమి
ఇన్ స్టాలో ఆ రీల్‌ను మహారాష్ట్ర.ఫార్మర్ (Maharashtra.farmer) పేజ్ ద్వారా షేర్ చేశారు. ఆ వీడియోను రూపాలీ అల్హాట్ చిత్రీకరించారు. రీల్లో మేసెజ్ ఉండటంతో జనాలకు కనెక్ట్ అయ్యింది. 12.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1.4 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఆ రీల్‌కు స్మార్ట్ మౌషీ అనే క్యాప్షన్ పెట్టారు. సో.. అలా బరువు కొలిచే బౌల్ కింద స్కానర్ ఏర్పాటు చేశారు. వావ్.. సూపర్ ఐడియా అని అంటున్నారు.
ఇదే డిజిటల్ ఇండియా (digital india).. క్యాష్ లెస్ ఇండియా అని ఒకరు రాశారు. మమ్మ రాక్స్ కస్టమర్స్ షాక్స్ అని మరొకరు.. ఇదీ భారతీయ అమ్మ తెలివికి నిదర్శనం అని మరొకరు రాశారు. గత ఏడాడి డిసెంబర్లో ఓ టీ స్టాల్ విక్రేత పేమెంట్స్‌ను క్రిప్టో కరెన్సీ ద్వారా తీసుకున్నారు.