Delivery Boys: సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. ఇప్పుడు డెలివరీ బాయ్ (Delivery Boys) రూపం ఎత్తారు. అవును.. మీరు చదివేది నిజమే.. ఇదివరకటిలా ఫోన్ చేయడం లేదు. డైరెక్ట్ ఇంటికి వస్తున్నారు. వస్తూనే తెగ హడావిడి చేస్తున్నారు. మీ పేరుతో పార్సిల్ వచ్చిందని అంటున్నారు. అమెజాన్, ప్లిప్ కార్ట్ పేరు చెప్పి.. డ్రామా ఆడుతున్నారు. మేం చేయలేదని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు.
ఆర్డర్ (order) వచ్చిందని.. ఓటీపీ అంటూ హడావిడి చేస్తారు. డబ్బులు ఇవ్వమని హడావిడి చేస్తారు. ఆర్డర్ (order) చేయలేదంటే.. పేరు, మొబైల్ నంబర్ అడుగుతారు. అప్పటికే ఓ సారి సర్వే చేస్తారెమో కానీ.. పేరు, నంబర్ చూపిస్తారు. నిజమే కదా అని అనుకున్నారో అంతే సంగతులు.. అవును.. మీరు సైబర్ కేటుగాళ్ల ట్రాప్లో పడినట్టే.. మొబైల్ నంబర్ చెప్పి.. ఓటీపీ చెప్పారో, ఇక గోవింద. మీ అకౌంట్ నుంచి డబ్బులు మాయం అవడం ఖాయం.
హైదరాబాద్లో (hyderabad) ఇటీవల అలాంటి మోసాలు జరుగుతున్నాయి. దీంతో తెలంగాణ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. డెలివరీ బాయ్ పేరుతో వచ్చేవారిని నమ్మొద్దని కోరారు. మొబైల్ నంబర్ చెప్పొద్దని.. ఓటీపీ (otp) అస్సలు చెప్పొద్దని కోరారు. అలా చేస్తే మీ ఖాతాలో ఉన్న నగదును కొల్లకొడతారని వార్నింగ్ ఇస్తున్నారు. ఆన్ లైన్లో (online) ఏ ఆర్డర్ వచ్చినా సరే.. అదీ ఏ సంస్థ.. ఆర్డర్ ఇచ్చామా లేదా అనే విషయాలు ఆరా తీయాలని మరీ మరీ కోరుతున్నారు. సైబర్ కేటుగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అమాయక జనాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో.. డెలివరీ బాయ్స్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.