»Team India Rams Into Asia Cup Final By Beating Sri Lanka
Asia Cup ఫైనల్లోకి టీమిండియా.. లంకను చిత్తుచేసిన రోహిత్ సేన
ఆసియా కప్ లీగ్ మ్యాచ్‌ల్లో భారత్ దుమ్మురేపుతోంది. లంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్ అంతగా రాణించకున్నప్పటికీ.. బౌలర్లు సత్తా చాటారు.
Team India Rams Into Asia Cup Final By Beating Sri Lanka
Team India: ఆసియా కప్‌లో (Asia Cup) టీమిండియా (team india) వరస విజయాలను నమోదు చేస్తోంది. దాయాది పాకిస్థాన్‌పై (pakistan) ఘన విజయం సాధించిన మరుసటి రోజు.. శ్రీలంకపై విక్టరీ కొట్టింది. వరసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లోకి దూసుకెళ్లింది. టీమిండియా (team india) బ్యాట్స్‌మెన్ అంతగా రాణించలేదు. 49.1 ఓవర్లలో 213 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. అయినప్పటికీ కుల్దీప్ యాదవ్ (kuldeep yadav), రవీంద్రా జడేజా (ravindra jadeja) శ్రీలంక బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచారు.
కొలంబోలో సూపర్-4 మ్యాచ్ నిన్న జరిగింది. 214 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక (sri lanka).. ఏ దశలోనూ విజయం దిశగా అడుగులు వేయలేదు. 99 పరుగులకే 6 కీలక వికెట్లను కోల్పోయింది. వెల్లాలగే 42 పరుగులతో పోరాట పటిమ కనబరిచాడు. ధనంజయ డిసిల్వా 41 పరుగులు చేసి అతనికి తోడుగా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. రవీంద్రా జడేజా, బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, హార్థిక్ పాండ్యా ఒక వికెట్ తీశారు. గత 13 వన్డేల్లో ఓటమి లేకుండా వస్తోన్న శ్రీలంకను (sri lanka) భారత జట్టు మట్టి కరిపించింది. శ్రీలంక విజయాల జైత్రయాత్రకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేశారు. బంగ్లాదేశ్‌తో (bangladesh) భారత్ మ్యాచ్ 15వ తేదీన జరగనుంది.