»20 Lakh People Died In 2 Months Heavy Deaths Due To Chinas Rules
Corona: 2 నెలల్లో 20లక్షల మంది మృతి..చైనా రూల్స్ వల్ల భారీగా మరణాలు!
రెండు నెలల్లో చైనాలో 20 లక్షల మంది వరకూ మరణించినట్లు అధ్యయనాలు వెల్లడించాయి. చైనాలోని కొన్ని యూనివర్సిటీలు పరిశోధనలు చేయగా ఈ షాకింగ్ విషయం వెలుగుచూసింది.
కరోనా వైరస్ (Corona Virus) చైనా నుంచే వ్యాపించిందని ప్రపంచంలోని అన్ని దేశాలు ఆరోపించినప్పటికీ దానికి సంబంధించి కచ్చతమైన ఆధారాలేవీ లేవు. చైనా (China) కూడా తమ దేశంలోని కరోనా కేసుల గురించి, ఆ వైరస్ వల్ల మరణించిన వారి గురించి ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ (Lockdown)ను చైనా ఎత్తివేసింది. అలా ఎత్తివేసిన రెండు నెలల్లోనే సుమారు 20 లక్షల మంది వరకూ మృతిచెందారు.
అమెరికా(America)లోని సీటెల్ ప్రాంతంలో ఉన్న ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ సెంటర్ ఈ షాకింగ్ అధ్యయనాన్ని వెల్లడించింది. చైనాలోని కొన్ని యూనివర్సిటీలు కలిసి ఈ పరిశోధన చేశాయి. మరణాల డేటా నమూనాల ఆధారంగా ఈ అధ్యయనం సాగింది. డిసెంబర్ 2022 నుంచి జనవరి 2023 మధ్య 30 ఏళ్లు పైబడిన వారు కరోనా(Corona Virus)తో మరణించారని, వారి సంఖ్య 1.87 మిలియన్లు దాటిందని ఆ అధ్యయనం వెల్లడించింది.
కరోనా(Corona Virus) వల్ల మూడేళ్ల పాటు అమలు చేసిన జీరో కోవిడ్ విధానానికి గత డిసంబర్లో చైనా ముగింపు పలికింది. లాక్డౌన్ (Lockdown) ఎత్తివేసిన వెంటనే ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. అయితే చైనా ప్రభుత్వం మాత్రం తమ దేశంలో మరణించిన వారి సంఖ్యను తక్కువ అని చూపిస్తూ నివేదికలు ఇచ్చినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్యను నేషనల్ హెల్త్ కమిషన్ ఆఫ్ చైనా (National Health Commision of china ) ఇప్పటి వరకూ వెల్లడించలేదు.