కేరళ (Kerala)లో దారుణం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న జీప్ (Jeep) వయనాడ్ ప్రాంతంలోని లోయలోకి పడిపోయింది. దీంతో ఆ జీప్లో ప్రయాణిస్తున్న 9 మంది కూలీలు దుర్మరణం (9 died) చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రంగా గాయాలు (4 injured) అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయినవారంతా కూడా టీ ఎస్టేట్ అనే కంపెనీలో పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారంతా ఆ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులని తెలుసుకుని వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. జీప్లో మొత్తం 12 మంది ఉన్నారని, కూలీ పనులకు వెళ్తుండగా ఈ దారుణం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
మృతులు రాణి, శాంత, చిన్నమ్మ, లీల, షాజబాబు, రబియా, మారి, వసంతతో పాటు మరో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో లత, ఉమాదేవి, జీప్ డ్రైవర్ మణి తీవ్రంగా గాయపడ్డారు. వంకరగా ఉన్న మార్గం గుండా వెళ్తుండగా వాహనం లోయలో బోల్తా పడిందని, ప్రమాదంలో జీపు పూర్తిగా ధ్వంసమైనట్లు పోలీసులు వెల్లడించారు.