»Fire Accident In Vijayawada Benz Circle 300 Bikes Burnt
Vijayawada:లో భారీ అగ్ని ప్రమాదం..300 బైక్స్ దగ్ధం
ఏపీలోని విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. ఈ నేపథ్యంలో ఓ షోరూంలో ఉన్న దాదాపు 300కు పైగా బైక్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ఆరంభించారు.
fire accident in Vijayawada benz circle 300 bikes burnt
విజయవాడ(Vijayawada)లో భారీ అగ్నిప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున కేపీనగర్లోని టీవీఎస్ వాహన షోరూమ్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో షోరూంతోపాటు గోదాంలో ఉన్న సుమారు 300 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. విజయవాడలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కళాశాల సమీపంలో ఈ షోరూమ్ ఉంది. నగరంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాల ప్రధాన కార్యాలయం ఇదే కావడంతో గోదాముల్లో వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఇదే ప్రాంతంలో ద్విచక్ర వాహనాల షోరూం, సర్వీస్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నారు.
అయితే గురువారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా షోరూమ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే గోదాముకు మంటలు వ్యాపించాయి. భద్రతా సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రీఫ్యాబ్రికేటెడ్ షోరూమ్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. గోదాములో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సాధారణ ద్విచక్ర వాహనాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అన్నారు. పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పెట్రోలు వాహనాలు ఉంచే గోదాం దగ్గర కూడా పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు నిలిచి ఉండడం.. వాటికి చార్జింగ్ పెట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.