ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నేతల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పల్నాడు జిల్లాలో పర్యటించిన విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) మంత్రి విడదల రజనీ(Vidadala Rajini)పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు కీలక నేతలను విడదీశారని గుర్తుచేశారని తెలిసింది
Vijayasai Reddy fire on Vidadala Rajini is that the reason
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ నేతల్లో వర్గ బేధాలు క్రమంగా బయటపడుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో వైకాపా నేతల పనితీరుపై రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) బుధవారం సమీక్షించారు. ఈ క్రమంలోనే మంత్రి విడదల రజనీ(Vidadala Rajini)పై విజయసాయి ఫైర్ అయినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జాన్ సైదా వర్గాలను విడదీసి పార్టీని నిర్వీర్యం చేశారని రజనీపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
అంతేకాదు శ్రీకృష్ణదేవరాయలతో సఖ్యతగా లేదని, రజనీ ప్రజలకు దూరమయ్యారని ఐప్యాక్(IPACK) ఇచ్చిన నివేదికపై కూడా ఎంపీ(MP) ఆమెను ప్రశ్నించారు. దీంతోపాటు అక్కడి పరిస్థితిని ఇతర నేతలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో తనపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్న అసంతృప్త వర్గాలను విజయసాయిరెడ్డిని కలవకుండా అడ్డుకునేందుకు మంత్రి(minsiter) రజనీ ప్రయత్నించారనే ప్రచారం కూడా జరిగింది. అయితే నరసరావుపేటలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మంత్రి విడదల రజనీ ఎంపీ రాకకు ముందుగా వేర్వేరుగా సమావేశమయ్యారు. ప్రధానంగా మంత్రి రజనీ ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గురువారం జరిగే నియోజకవర్గ ముఖ్యకార్యదర్శుల సమావేశంలో మంత్రి రజనీతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.