IMS scam: హైదరాబాద్‌లో వెలుగులోకి వందల కోట్ల కుంభకోణం
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల కుంభకణంలో కేసులో ఈడీ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. వైద్యం చేయకుండానే చేసినట్లు, మందులు కొనకుండానే ఫేక్ బిల్లులు సృష్టించి వందల కోట్లు దోచుకున్నారు. ఈ కేసులో మొత్తం 15 మందిపై కేసు నమోదైంది.
IMS scam: దేశంలో ఎక్కడ చూసినా స్కాములే(scam), అనేక చోట్ల ఎక్కడ చూసినా అవినీతియే(Corruption) కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఇదే తంతు నడుస్తుంది. తినే తిండి దగ్గర నుంచి జబ్బు చేస్తే వేసుకునే మాత్ర వరకు ప్రతీదాంట్లో అధికార హోదాలో ఉన్నవారు తమ చేతివాటం చూపించడమే. దొడ్డి దారిలో అడ్డగోలుగా దోపిడికి నాయకులు, అధికారులు తెగబడిపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సంచలనంగా మారిన ఇన్స్‌రెన్స్ మెడికల్ సెర్వీస్ కుంభకోణం(Insurance Medical Services Scam) గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
2019లో ఈ డిపార్ట్లో కొందరు వ్యక్తులు చేసిన కుంభకోణం వెలుగులోకి రావడంతో వారిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితులకు సంబంధించిన మొత్తం రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ తాజాగా జప్తు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా బీమా వైద్య సేవలు(ఐఎంఎస్) కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐఎంఎస్ మాజీ సంచాలకులు దేవికారాణితో పాటు 15 మందిపై ఈడీ కేసు ఫైల్ చేసింది. వైద్యం చేయకుండానే చేసినట్లు చూపించి కోట్లు లూటీ చేశారు. అలాగే లక్షల రూపాయల మందులు కొనకుండానే ఫేక్ బిల్లులు సృష్టించారు.