Manipur: మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిప్పింది. ఘటనతో ఏడుగురు వ్యక్తులకు సంబంధం ఉందని సీబీఐ తెలిపింది. ఆ ఏడుగురిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. నిందితులపై సామూహిక అత్యాచారం, హత్య, మహిళ పట్ల అసభ్య ప్రవర్తన, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చూడండి: Maharashtra: రైలులో చెలరేగిన మంటలు.. 5 బోగీలు దగ్ధం
మణిపూర్‌లో కొన్ని రోజుల కిందట కుకీ, మెయితీ తెగల మధ్య వివాదం చెలరేగింది. మెయితీ తెగలను ఎస్టీలగా గుర్తించాలనే డిమాండ్‌తో వివాదం మొదలైంది. కుకీ తెగలు దీనిని వ్యతిరేకించడంతో గొడవ పెరిగింది. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వేరే వర్గానికి చెందిన ఇళ్లను తగలపెట్టారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారం చేశారు. ఘటన మే నెలలో జరగగా.. దీనికి సంబంధించిన వీడియోలు జూలైలో వైరల్ అయ్యాయి.