ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హాట్ కామెంట్స్ చేశారు. తన ప్రత్యర్థి రష్యా అధ్యక్షుడు ఇంకా బతికే ఉన్నారా అని సందేహాం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. టిపిన్ చేసే సమయంలో మాట్లాడుతూ.. పుతిన్ ఇంకా బతికే ఉన్నారా? లేదా? అన్నారు.
పుతిన్ జీవించి ఉన్నారో లేదో తెలియడం లేదన్నారు. ‘పుతిన్ బతికే ఉన్నారా? లేదంటే మరి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారు? అర్థం కావడం లేదు? శాంతి చర్చల గురించి ప్రస్తావన తీసుకువచ్చి సమయంలో ఎవరితో డిస్కస్ చేయాలో తెలియడం లేదు’ అని అన్నారు. ఉక్రెయిన్ ఆన్లైన్ మీడియా సంస్థ జెలెన్ స్కీ కామెంట్లను హైలెట్ చేసింది. దీంతో రష్యా కూడా కౌంటర్ అటాక్ చేసింది.
ఉక్రెయిన్‌కు పుతిన్ అతి పెద్ద సమస్యగా మారాడాని ఇప్పుడు అర్థమైందని రష్యా ఒక ప్రకటనలో తెలిపింది. పుతిన్ రష్యా ఉనికిలో ఉండకూడదని జెలెన్ స్కీ కోరుకుంటున్నారని స్పష్టమవుతుందని పేర్కొంది. రష్యా తీసుకునే నిర్ణయాల్లో పుతిన్ ఎప్పుడూ ఉంటారని తెలిపింది. ఇది ఎంత త్వరగా గ్రహిస్తే ఉక్రెయిన్‌కు అంత మంచిది అని స్పష్టంచేసింది. మీడియా ఈవెంట్, ఇతర కార్యక్రమాలను పుతిన్ రద్దు చేసుకున్నారు. అందుకోసమే జెలెన్స్కీ బతికి ఉన్నాడా అని సందేహా పడ్డారు. పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఇటీవల వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.