W.G: ఆకివీడు పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్ వద్ద నగర పంచాయతీ అధికారులు మంగళవారం ఆక్రమణలను తొలగించారు. మూడు రోజుల క్రితమే ఆక్రమణలు తొలగించినా, చిరు వ్యాపారులు మళ్లీ తోపుడు బండ్లు ఏర్పాటు చేయడంతో అధికారులు సీరియస్ అయ్యారు. నగర పంచాయతీ మేనేజర్ వెంకటేశ్వరరావు, SI సాకేత్లు వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.