తూర్పు లిబియా (Libya) దేశంలో భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. వెల్లువెత్తిన వరదల వల్ల 2 వేల మంది దుర్మరణం చెందారు. తుపాన్ కారణంగా ఆ దేశంలో భారీ వర్షాలు కురవడంతో డెర్నా నగరంలోనే వేలాది మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని తూర్పు లిబియా అధికారులు ప్రకటించారు. తుపాన్ వల్ల డేనియల్ లిబియాలో చాలా ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. భారీ ఆస్తి నష్టం వాటిళ్లింది.
The water level rose several meters and reached the rooftops of Al-Marj suburb pic.twitter.com/9AYAnjLTxU
తుపాన్ ప్రభావంతో ఉత్తర ఆఫ్రికా దేశంలోని తీర పట్టణాల్లో వ్యవసాయ భూములన్నీ వరదనీటితో మునిగాయి. డెర్నా పట్టణంలోని నదిపై ఉండే ఆనకట్ట కూలిపోయింది. లిబియా నేషనల్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ మిస్మారీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద విపత్తులో 6 వేల మందికి పైగా గల్లంతయ్యారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
After devastating Greece in the country’s worst ever flood disaster, #medicane Daniel submerges East Libya under water. First estimate of 2,000 dead, many missing thought to have been washed out to sea. Apocalyptic. #ClimateCrisis#ClimateActionNowpic.twitter.com/HTxgiTQbaz
దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో లిబియా దేశ అధ్యక్ష మండలి సభ్యులు అంతర్జాతీయ సమాజాన్ని సాయం కోరింది. వరదల (Libya floods) వల్ల దేశంలో ఇప్పటి వరకూ 2 వేల మంది మరణించారని, వేలాది మంది తప్పిపోయారని తూర్పు ఆధారిత పరిపాలన అధిపతి ఒసామా హమద్ వెల్లడించారు. వరదల (Floods) వల్ల భవనాలు, రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, తీరంలోని భవనాలు చాలా వరకూ ధ్వంసం అయ్యాయని అధికారులు వెల్లడించారు.