Justin Trudeau: జీ20 సదస్సు అట్టహసంగా జరిగిన విషయం తెలిసిందే. భారత్ వచ్చిన అతిథులు తిరిగి వెళ్లిపోయారు. కెనడా (canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau ) మాత్రం ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. దీనికి కారణం మన దేశంతో, లేదా మోడీతో ఏదైనా పని ఉంది అనుకుంటే తప్పే. ఆయన అధికారిక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మంగళవారం మధ్యాహ్నం కూడా ఆయన బయల్దేరడం కష్టమే. ట్రూడో కోసం మరో విమానాన్ని కెనడా ఎయిర్ఫోర్స్ పంపింది. దీనిని తొలుత రోమ్ మీదుగా ఢిల్లీకి చేర్చాలని భావించారు. తర్వాత మార్గం మార్చి లండన్ రూట్ వైపు మళ్లించారు.
జీ20(G20) పర్యటనకు ముందే తాము భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని కెనడా ప్రకటించింది. దీనికి సరైన కారణం తెలియజేయలేదు. జులైలో కెనడాలోని ఖలిస్థానీ గ్రూపులు భారత దౌత్యవేత్తలను బెదిరిస్తూ పోస్టర్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai Shankar) స్పందించారు. ఇలాంటి ఘటనలు రెండు దేశాలకు ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతాయన్నారు. దీనితో జీ20 సదస్సులో అంత సుముఖత ప్రదర్శించలేదు. తొలి రోజు వింధుకు రాకపోవడం. ప్రధాని మోడీ కలుగుజేసుకున్న అంటి ముట్టనట్లుగా వ్యవహరించారు. భారత్కు హాని చేసే ఖలిస్థానీలకు కెనడా స్థావరం ఇవ్వడం కరెక్ట్ కాదని మోడీ ప్రసంగం కూడా ట్రూడో అలకకు కారణం అయ్యింది. ఇలాంటి సమయంలో ఎంత త్వరగా బయటపడాలి అనుకున్నారు. విమానం మోరాయించడంతో కెనడాలో ఆయన ప్రత్యర్థులు ట్రూడోను గట్టిగానే విమర్షిస్తున్నారు.
భారత్(bharat), కెనడా(canada) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడికి చదవు సహా ఉద్యోగాల కోసం వెళ్లిన భారత విద్యార్థుల పరిస్థితి గురించి..వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ పిల్లలు సరిగ్గా చదువుకోలేక పోతున్నారని, ఈ వివాద సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.