Covid-19 leak: కరోనా ఎక్కడి నుండి లీకైందో చెప్పిన అమెరికా
కోవిడ్ 19 (Covid-19) చైనా లోని ఓ ల్యాబ్ ( china lab) నుండి బయటకు వచ్చింది అనే వాదన మొదటి నుండి ఉంది. తాజాగా... యుఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ (US Energy Department) కూడా అదే స్పష్టం చేసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ (The Wall Street Journal) వెల్లడించింది. చైనాలోని ప్రయోగశాల నుండి ఈ మహమ్మారి ఉద్భవించినట్లు అమెరికా స్పష్టం చేస్తోంది.
కరోనా మహమ్మారి (coronavirus) ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకున్నది.. అలాగే కోట్లాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశాలకు దేశాలే ఆర్థిక సంక్షోభంలో (recession) కూరుకుపోయాయి. అలాంటి కరోనా మొదటిసారి 2019 చివరలో వెలుగు చూసింది. 2020 జనవరి నుండి క్రమంగా ప్రపంచ దేశాల పైన ప్రభావం చూపింది. అలాంటి కోవిడ్ 19 (Covid-19) చైనా లోని ఓ ల్యాబ్ ( china lab) నుండి బయటకు వచ్చింది అనే వాదన మొదటి నుండి ఉంది. తాజాగా… యుఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ (US Energy Department) కూడా అదే స్పష్టం చేసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ (The Wall Street Journal) వెల్లడించింది. చైనాలోని ప్రయోగశాల నుండి ఈ మహమ్మారి ఉద్భవించినట్లు అమెరికా స్పష్టం చేస్తోంది. లక్షలాది మంది ప్రాణాలను తీసిన… తీస్తున్న.. ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీ (Wuhan Institute of Virology) నుంచి పుట్టి ఉండొచ్చని అమెరికాకు చెందిన ఇంధన శాఖ తన తాజా నివేదికలో పేర్కొనడం గమనార్హం. వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా లీక్ అయినట్లు గతంలోనే ఎన్నో వార్తలు… నివేదికలు వచ్చాయి. కానీ చైనా దానిని ఎప్పుడూ ధృవీకరించలేదు. ఎనర్జీ డిపార్ట్మెంట్ గతంలో కరోనా వైరస్ యొక్క మూలం గురించి ఖచ్చితంగా వెల్లడించలేదు. తాజా పరిశోధనల్లో వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ ఉద్భవించిందని తేల్చి చెప్పింది. యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నివేదికను ఇటీవల వైట్ హౌస్, కాంగ్రెస్ ముఖ్య సభ్యులకు క్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్ విభాగానికి అందించారు.
కరోనా వైరస్ చైనా ల్యాబ్ లో జరిగిన ప్రమాదం ద్వారా వ్యాప్తి చెందిందని చెప్పారు. జాతీయ ఇంటెలిజెన్స్ ప్యానెల్‌తో పాటు మరో నాలుగు ఏజెన్సీలు ఇప్పటికీ ఇది సహజ ప్రసారం వల్ల జరిగినట్లు నిర్ధారించాయి. ఇంతకు ముందు కూడా 2021లో చైనాలో ల్యాబ్ లీక్ కారణంగా కరోనా సంభవించిందని ఎఫ్‌బీఐ నిర్ధారించింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 6,798,622 మంది మృత్యువాత పడ్డారు. 679,726,386 మందికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకింది. భారత్ లో మూడేళ్లలో నాలుగున్నర కోట్ల మందికి కరోనా సొకగా… ఐదు లక్షల మందికి పైగా చనిపోయారు.