సాధారణంగా ఓజోన్ (Ozone) అంటే మూడు ఆక్సిజన్ అణువుల సమ్మేళనంగా (ఓ3). ఇది సూర్యుడి నుంచి వచ్చే ఆల్ట్రా వయోలెట్ కిరణాల నుంచి భూమిని, ధరణినిపై జీవరాశిని రక్షిస్తోంది. ఎగువ వాతావరణంలో ఒక పొరలా ఉండీ భూమిని రక్షిస్తోంది. కొన్ని కారణాల వల్ల ఈ పొరకు రంధ్రాలు (Holes) ఏర్పడుతున్నాయి. సాధారణంగా రంధ్రాలు అంటే ఆ ప్రాంతంలో ఓజోన్ లేకపోవడం అని చెప్పవచ్చు. గడిచిన కొన్ని దశాబ్ధాలుగా ఓజోన్ లేయర్ పలుచబడిపోతుందని శాస్త్రవేత్తలు (Scientists)హెచ్చరించారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో అంటార్కిటికా పైన ఉన్న ఓజోన్ పొర (Ozone Layer) రంధ్రం పరిమాణం భారీగా పెరిగిపోయింది.
యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)కు చెందిన సెంటినల్ 5పి ఉపగ్రహం ఓజోన్ చిత్రాలను తీయగా ఈ విషయం తెలిసింది. 2023, సెప్టెంబరు 16 నాటికి అంటార్కిటికా (Antarctica) ఓజోన్ రంధ్రం 26 మిలియన్ స్క్వేర్ కి.మీ.కు విస్తరించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.అగ్నిపర్వతం వల్లే ఈ రంధ్రం పెరిగింది. అప్పుడు విడుదలైన బూడిద, విష వాయువులు అంటార్కిటికాపై ఓజోన్ పలచబడటానికి, అక్కడి రంధ్రం పెరిగిపోవడానికి కారణమని తెలుస్తోంది. శాటిలైట్ (Satellite) చిత్రాలను పరిశీలించగా హంగా టోంగా హుంగా హాపై అగ్నిపర్వతం వెదజల్లిన బూడిద భూమిపై చాలా ఎత్తు వరకు విస్తరించిందని తెలిసింది.