W.G: తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జి పాల్గొన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలను ఒక్కొక్కటిగా స్వీకరించి, వాటికి సంబంధించిన అధికారులతో నేరుగా మాట్లాడి పరిష్కారం దిశగా వెంటనే చర్యలు ప్రారంభించారు.