HYD: CP-ERTRNG-P పేరుతో మీ అకౌంట్లో రూ.3,000 క్రెడిట్ అయినట్లు షార్ట్ లింక్‌తో కూడిన మెసేజెస్ నమ్మొద్దని HYD సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ‘ఇవి పూర్తిగా ఫేక్ మెసేజ్‌లు. లింక్ ఓపెన్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. ఇటువంటి మోసపూరిత SMSలను నమ్మవద్దు, లింక్ పై క్లిక్ చేయవద్దు’ అని తెలిపారు.