మెదక్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ ఎంపిక పరీక్ష -2026 నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు డీఈవో విజయ తెలిపారు. 2026 -27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశానికై నిర్వహించే ఎంపిక పరీక్షకు జిల్లాలో ఏర్పాటుచేసిన 6 కేంద్రాల్లో ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు తెలిపారు. ఈనెల 13న ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.