జగిత్యాల జిల్లా దరూర్ క్యాంప్‌లోని ఈవీఎం గోదాంను కలెక్టర్ సత్యప్రసాద్ సమగ్రంగా తనిఖీ చేశారు. గోదాంలో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరు, యంత్రాల సాంకేతిక స్థితిని పరిశీలిస్తూ ఎన్నికల ప్రక్రియలో భద్రత అత్యంత కీలకమని తెలిపారు. నిరంతర పర్యవేక్షణ, ఎలాంటి లోపాలు లేకుండా వ్యవస్థలు పనిచేసేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.