HYD: మాదాపూర్ పరిధిలోని చందానాయక్ తండా ప్రభుత్వ ప్రాఠశాలకు చెందిన 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థత చెందగా.. కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారాణాలు తెలియాల్సి ఉంది.