శ్రీకాకుళం సంతోషిమాత గుడి జంక్షన్ వద్ద స్థానిక టీడీపీ నాయకులు నిర్వహించిన అభినందన సభకు ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో టీడీపీను బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులను సూచించారు. అలాగే స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.