విశాఖ ఎకనామిక్ రీజియన్ పై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వీఈఆర్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఇతర జిల్లాలలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.