HNK: ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో అప్పుల బాధతో యాకూబ్ పాషా (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా పెరగడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.