MDK: జవహర్ నవోదయ పరీక్ష కేంద్రాల వద్ద 163 (144 సెక్షన్) బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ DV శ్రీనివాసరావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా పరిధిలో రేపు నిర్వహించనున్న ఆరు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఉండడం నిషేధమన్నారు.