AP: అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హోంమంత్రి అనిత పరామర్శించారు. చింతూరులో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శీతాకాలంలో ఘాట్ రోడ్డులో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని వెల్లడించారు.