NLR: కందుకూరు ప్రభుత్వాసుపత్రిలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయవాదులు, కిషోర్ మాట్లాడుతూ.. ఆరోగ్య సేవలు ప్రతి పౌరుని హక్కేనని, ఆర్థిక భారం లేకుండా వైద్యసేవలు అందే విధంగా వ్యవస్థలు బలపడాలి అని పేర్కొన్నారు. కార్యక్రమం నిర్వహణకు సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణికి ధన్యవాదాలు తెలిపారు.