ATP: అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు డంపింగ్ యార్డ్లో జరుగుతున్న బయో మైనింగ్ పనులను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పరిశీలించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఇతర మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పనుల పురోగతిని, నాణ్యతను గురించి ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.