KRNL: కోడుమూరులో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో MLA బొగ్గుల దస్తగిరి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ముఖ్యంగా కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, భూ సమస్యలు, నీటి కొళాయి కనెక్షన్లు, వీధి లైట్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ గ్రావెల్ తదితర సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పక పరిష్కారం చూపుతామని MLA అన్నారు.