KMR: జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగిసిందని DPO మురళి స్పష్టం చేశారు. మొదటి విడతలో 167 సర్పంచ్ స్థానాలకు 11 ఏకగ్రీవం కాగా, 156 సర్పంచ్ స్థానాలకు, 1520 వార్డు స్థానాలకు 433 ఏకగ్రీవం కాగా 1084 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. 3 ఉప సర్పంచ్, 3 వార్డుల(నామినేషన్లు రాలేదు) స్థానాలకు ఎన్నిక జరగలేదన్నారు.