విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాల్లో దర్శనాల వద్ద పోలీసుల అత్యుత్సాహం, ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. ప్రోటోకాల్ నిబంధనలు పక్కనపెట్టి, పోలీసులు తమ వారికి దొడ్డిదారిన దర్శనాలు చేయిస్తున్నారని, క్యూలైన్లలో కనీసం మంచినీరు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.