అన్నమయ్య: రైల్వే కోడూరు, కోడూరు టౌన్, కోడూరు రూరల్, ఓబులవారిపల్లి మండలాల్లో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని DEE ప్రియదర్శన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. విద్యుత్తు ఉప కేంద్రాలలో మరమ్మత్తులు, చెట్లు తొలగింపు నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. కావున విద్యుత్ వినియోగదారుల సహకరించాలని ఆయన కోరారు.