TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు హైదరాబాద్ రానున్నారు. రేపు రా.7 గంటలకు ఉప్పల్ వేదికగా లియోనాల్ మెస్సీ, CM రేవంత్ మధ్య జరిగే ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు ఆయన నగరానికి వస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పంచాయతీ ఎన్నికల వేళ వస్తున్న రాహుల్.. ఈ అంశంతోపాటు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పార్టీ నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.