KDP: బ్రహ్మంగారిమఠం పోలేరమ్మ ఆలయంలో హుండీ చోరీ జరిగి నెలరోజులు గడిచినా దోషులను పట్టుకోకపోవడంపై సీపీఎం నేత శివకుమార్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 11న చోరీ వెలుగుచూసినా, దేవాదాయ అధికారులు దొంగలను కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏడాదిలో రెండుసార్లు చోరీ జరగడం దారుణమని, నిందితులను గుర్తించకపోతే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.