KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి ఔట్ పోస్ట్ ASI కాశయ్య శుక్రవారం తెలిపారు. పట్టణంలోని రాజీవ్ సర్కిల్ వద్ద అనారోగ్యంతో, అపస్మారక స్థితిలో పడిపోయిన వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సదరు వ్యక్తి వివరాలు తెలిసిన వారు ఆసుపత్రిలోని పోలీస్ ఔట్ పోస్ట్‌ను సంప్రదించాలన్నారు.