ELR: భీమడోలు, ఉంగుటూరు మండల గ్రామాల్లో నిర్మించనున్న రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఎలైన్మెంట్లను శుక్రవారం క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించారు. ఈమేరకు భీమడోలు, పూళ్ళ, కోడూరుపాడు, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు, నాచుగుంట, బాదంపూడి గ్రామాలలో రైల్వే అధికారులు పరిశీలించారు. పలు వివరాలు నమోదు చేసుకున్నారు. ఎంపీ పుట్టా మహేష్ ఓఎస్టి ఫణీంద్ర పాల్గొన్నారు.