KKD: పిఠాపురం మండల న్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో హార్వెస్ట్ స్కూల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల హక్కులు, విద్యార్థి హక్కులు, న్యాయ సహాయం వంటి అంశాలను సులభంగా వివరించారు. చట్టాలపై జ్ఞానం ప్రతి విద్యార్థికి అవసరమని సూచించారు. ఉచిత న్యాయ సహాయం కావాల్సిన వారు సేవా సంఘాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు.