MBNR: మహమ్మదాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. మండల వ్యాప్తంగా ఉన్న 22 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన 15 మంది సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎం నారాయణ, సీనియర్, యువ నాయకులు కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఘనంగా సన్మానించారు.