ADB: రైతుల దగ్గర ఉన్న సోయా పంటను ప్రతి గింజ కొనుగోలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు బొర్రన్న కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి ర్యాలీగా వెల్లి బోథ్ తాహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 68 వేలకు పైగా ఎకరాలలో సోయా పంటను పండిస్తే ఇప్పటివరకు కేవలం 1058 మంది రైతుల దగ్గర 22954 క్వింటాల్లో పంటను మాత్రమే కొన్నారన్నారు.