NLR: ఉదయగిరి పట్టణంలోని శ్రీ బాలాజీ ఫుట్ వేర్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంపై నిర్వాహకుడు నరసింహులు అనుమానాలు వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితమే వ్యాపారం ప్రారంభించిన ఆయన, తెల్లవారుజామున సమాచారం అందగానే అక్కడికి చేరుకున్నానని తెలిపారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగిందని, పోలీసులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన కోరారు.