KRNL: కోడుమూరు మండలం లద్దగిరి సమీపంలోని హంద్రీనీవా కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్న ఈ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.