AP: మహిళల అంధుల క్రికెట్ జట్టుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రపంచకప్ సాధించిన క్రికెటర్లకు ఆయన అభినందనలు తెలిపారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షలు.. ట్రైనర్లకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లాలో తన గ్రామమైన తంబలహట్టి తండాకు రోడ్డు వేయాలని కెప్టెన్ దీపిక కోరగా.. పవన్ తక్షణ చర్యలకు ఆదేశించారు.