SKLM: ఆమదాలవలస మండల మహిళా సమైక్య కార్యాలయంలో ఏపీఎం నారాయణరావు ఆధ్వర్యంలో టీవోటీ విజన్ బిల్డింగ్ పై శిక్షణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు. మహిళల సంఘాల జీవనోపాధి అభివృద్ధి, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, సంఘాల ఆదాయ వృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.