VKB: మోమిన్ పేట్ మండలంలో 108 అంబులెన్స్‌ను జిల్లా కో-ఆర్డినేటర్ అబ్దుల్ రహీం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో వివిధ పరికరాలు, స్టాక్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సమయంలో 108కి కాల్ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రధమ చికిత్సను అందించి ఆసుపత్రికి చేర్చాలని సిబ్బందికి సూచించారు.