JN: భూగర్భ జల సంరక్షణలో విశేష కృషి చేసిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు జల్ ప్రహరీ సమ్మాన్ దక్కింది. డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ రిపోర్ట్‌లో భూగర్భ జలాలు పెరిగినట్లు గుర్తింపు రావడంతో ఈ పురస్కారం లభించిందన్నారు. చెక్‌డ్యాంలు, సోక్పిట్లు, ఫామ్ పాండ్లు, వన సంరక్షణ వంటి పనులను విభాగాల సమన్వయంతో విజయవంతం చేసినందుకు ఇది దక్కింది.