ELR: ఆగిరిపల్లి మండలంలోని పలు గ్రామాలలో నేర ప్రవృత్తి గల వ్యక్తులను సన్మార్గంలో నడిపేందుకు పోలీసులు శుక్రవారం పలు సూచనలు చేశారు. నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని తెలిపారు. భవిష్యత్తులో చట్టవ్యతిరేకమైన పనులు చేపడితే కఠినంగా వ్యవహరించవలసి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు.